కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు..

ఆర్ముర్ , ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు ఢిల్లీ లో పలువురు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది .కేంద్రం గ్రామీణ ప్రాంతాల కోసం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పథకం ద్వారా నిధులు రాష్ట్రానికి ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, ఢిల్లీ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కేంద్రం ఇచ్చిన వాటిని సరైన విధంగా ఉపయోగించడం లేదు అని అన్నారు. కలిసిన వారిలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తో పాటు, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పయల్ శంకర్,పాల్వాయి హరీష్ తదితరులు పాల్గొన్నారు.