బీడీ కార్మికులకు 4016 పెన్షన్ షరతులు లేకుండా అమలు చేయాలి
– సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఐ ఎఫ్ టి యు
– పాలెం రోడ్డు నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన, తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన.
– మోర్తాడ్ తహసీల్దార్ కు వినతి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 02 ( లోకంతీరు ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా (28 ఫిబ్రవరి 2014 కటప్ డేట్ ని తొలగిస్తూ)బీడీ కార్మికులందరికీ నాలు వేల16 రూపాయలు జీవన భృతి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవరం, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ముత్తేన్న డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. బీడీ పరిశ్రమను నాశనం చేయడానికి నరేంద్ర మోడీ సర్కార్ బహుళ జాతి సిగరెట్ కంపెనీలతో కుమ్ముక్కై వారికి అనేక సౌకర్యాలు కలిగిస్తూ.. ఆర్థిక లాభం చేకూర్చడానికి సబ్సిడీలుఇస్తూ బీడీ పరిశ్రమపై ట్యాక్సీలు పెంచి పరిశ్రమను దెబ్బ తీయుటకు కుట్ర చేశారు.
అందులో భాగంగానే రాష్ట్రంలో బీడీ కార్మికులకు చేతినిండా పని దొరకడం లేదు. నెలకు 5 రోజుల పని మాత్రమే దొరుకుతుంది. అందులోనూ సరిపడా ఆకు. తంబాకు కూడా ఇవ్వడం లేదు.. ఏ పరిశ్రమలు లేని విధంగా ముడి సరుకుని కార్మికులె కొన్ని పద్ధతితో ఆర్థికంగా నష్టపోతున్నారు…
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో చేతినిండా పని కల్పించాలని అనేక ఆందోళనలు చేశారు.
ఈ నేపథ్యంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం పని కల్పించడంలో వైఫల్యం చెంది జీవనభృతి ఇవ్వడానికి అంగీకరించింది. కానీ 2014 ఫిబ్రవరి 28వ తేదీ కట్ అప్డేట్ పెట్టి అంతవరకు పనిచేసిన వారికి మాత్రమే జీవన భృతిఇస్తానని ఆంక్షలు విధించింది.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తమ ఎన్నికల ప్రణాళికలో బీడీ కార్మికులకు జీవన భృతి 4016ఇస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమలో బీడీలు చుట్టే, ప్యాకింగ్ చేసే, బట్టి పెట్టే, కార్మికులతో పాటు గంపవల. కమిషన్ దార్లు..మునింలు.పరిశ్రమలో చేసే ఉద్యోగులందరికీ 4016 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని..
మోడీ సర్కార్ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోడ్ లను తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగు కోడ్ లను రద్దుచేసి కార్మిక చట్టాలను పునర్దించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలనివిజ్ఞప్తి చేస్తున్నారు, బీడీ పరిశ్రమపై ఆధారపడే లక్షలాదిమంది మహిళా,, కార్మికులకు 4016 రూపాయలు జీవన భృతి ఇచ్చిఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే లక్షలాదిమంది బీడీ కార్మికులు ఆందోళన చేస్తున్నామన్నరు.ఈ కార్యక్రమంలొ ఎం సత్య జిల్లా నాయకురాలు.వి ఆనంద్, . బాల కిషన్,సారా సురేష్. జిల్లా అధ్యక్షులు. ఏ ఐ పి కే ఎస్ జి కిషన్ . జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏ ఐ పి కే ఏం ఎస్, బీ అశోక్. జిల్లా నాయకులు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్. కమ్మర్పల్లి ఏరియా కమిటీ తదితరులు పాల్గొన్నారు.