Take a fresh look at your lifestyle.

పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో …..

0 1,838

పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో …..

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ కు ఘన సత్కారం.

నిజామాబాద్ , ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : నిజామాబాదు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కెమిస్ట్రీ& డ్రగిస్ట్ బిల్డింగ్ ఎల్లమ్మ గుట్టలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కు ఘనంగా సన్మానించించడం జరిగింది. అనంతరం నూతన క్యాలెండర్, డైరీ లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ధన్పాల్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రాథమిక చికిత్స చేస్తూ ప్రజలు కాపాడే వైద్యులు దేవునితో సమానం అని, ప్రజలకు నిస్వార్ధంగా వైద్య సేవలు అందించే పి ఎం పి లను కొనియాడారు . ఎల్లవేళలా వారికీ అండగా ఉంటానని అలాగే అసోసియేషన్ భవన నిర్మాణానికి 2 లక్షల ఆర్ధిక సహాయం కూడా చేస్తానని హామీ నిచ్చారు. ఈ కార్యక్రమం లొ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్గం మోహన్, ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్, కోశాధికారి ,ఎస్ పోషాద్రి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, భాస్కర్ శివునూరి,బట్టికిరి ఆనంద్, చింతకాయల రాజేందర్, గట్ల గంగాధర్, రామడుగు భగత్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.