Take a fresh look at your lifestyle.

అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి : సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం.

0 28

అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.
సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం భూపాలపల్లి ఏరియా అధ్యక్షుడు రాంబాబు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 2:సింగరేణి సంస్థ అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి న్యాయంగా రావాల్సిన పే అప్‌గ్రేడేషన్, పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ)తో పాటు ఇతర సేవా ప్రయోజనాలను యాజమాన్యం జాప్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం భూపాలపల్లి ఏరియా అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట అధికారుల డిమాండ్ల సాధన కోసం గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు గురువారం సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర, కేంద్ర కమిటీ నాయకులు, ఏరియా ప్రతినిధులు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాంబాబు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తే ఉద్యోగుల్లో విశ్వాసం పెంపొందడంతో పాటు సంస్థ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సెంట్రల్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షమయ్య, లైజన్ ఆఫీసర్ భూక్యా మోహన్, కార్యదర్శి జి. హేమానాయక్, వైస్ ప్రెసిడెంట్లు డి. సికిందర్ సింగ్, సెంట్రల్ కమిటీ నాయకులు బానోత్ మోహన్, వీరయ్య, జాయింట్ సెక్రటరీ రాజు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గోపీనాథ్, రవికుమార్, ట్రెజరర్ శ్రీనివాస్‌తో పాటు రాష్ట్ర, కేంద్ర, ఏరియా నాయకులు, ప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా అధికారులకు రావాల్సిన పే అప్‌గ్రేడేషన్, పీఆర్‌పీతో పాటు ఇతర సేవా ప్రయోజనాలను తక్షణమే అమలు చేసేలా సింగరేణి యాజమాన్యం, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.