ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
నందిపేట, ఆగస్టు 09 (లోకంతీరు) : .నందిపేట మండల వన్నెల.(కే) గ్రామంలో ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు గంపల ముత్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుపుకుంటామని జల్ జంగల్ జమీన్ అంటూ నినాదాన్ని అందజేసిన కొమరం భీమ్ ఆశయాలను నిలబెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు బొంత మహేష్, గంపల నరసయ్య ,పోతన్న ,గుండ్రెడ్డి భూమన్న. తదితరులు పాల్గొన్నారు.