రాష్ట్ర టూరిజం చైర్మన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేత
— విద్యార్థిని అభినందించిన పాఠశాల బృందం

కామారెడ్డి జిల్లా రాజంపేట ,ఆగస్టు 17 (లోకంతీరు) : జిల్లాలోని రాజంపేట మండలం తలమడ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కమ్మరి అభిరామ్ 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. శనివారం ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దోమ్మటి బిక్షపతి, ఉపాధ్యాయుల బృందం అభిరామ్ ను అభినందించారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ స్టేట్ ఇన్వొవేషన్స్ సిల్ ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలమడ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కమ్మరి అభిరాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిప్ తో కూడిన తాడిపత్రిని కనుక్కున్నాడు. సాధారణంగా గ్రామాల్లో దాన్యమును బయట ఆరబెడుతారు. కానీ వర్షం వచ్చినప్పుడు తాడిపత్రి ఒకవైపు కప్పిన కూడా కింది నుండి కానీ పక్కనుండి గాని నీరు వచ్చి ధాన్యం తడుస్తుంది. అలా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టడం చాలా కష్టంగా ఉంటుందని, ఈ సమస్య నుండి బయటపడడానికి అభిరామ్ తన ఆలోచనతో మూడు వైపులా జిప్ తో కూడిన తాడిపత్రిని తయారు చేశాడు. మూడువైపులా జిప్ ఉన్న తాడిపత్రిని ఉపయోగిస్తే ధాన్యము తడవదని, ఇది తక్కువ వ్యయం తో కూడుకున్నదని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొమ్మాటి బిక్షపతి మాట్లాడుతూ.. అభిరామ్ ఎప్పు5 ప్రశ్నలు వేస్తూ విన్నుతంగా ఆలోచిస్తాడని, అతను భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఆవిష్కరణలు చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు భగత్, ఆంజనేయులు, చక్రపాణి, వనిత, ఉపాధ్యాయులు దయాకర్, రజిత, ప్రభాకర్, నర్సింహరెడ్డి, అనిత, నర్సింలు, బాలయ్య, ఏఏపీసీ చైర్మన్ లత పాల్గొన్నారు.