గణేష్ శోభాయాత్రలకు డీజేల అనుమతి లేదు
– ఎస్సై మహేష్

ఎల్లారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : గణేష్ శోభాయాత్రలకు డీజేల అనుమతి లేదని, నిబం ధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ అన్నారు. గురువారం గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు, డిజే నిర్వాహకులతో ఎస్సై మహేష్ ముందస్తుగా కౌన్సిలింగ్ నిర్వహించారు.అనంతరం తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఈ సందర్బంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా చూడడం మనందరి బాధ్యత అని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా పోలీసులకు తెలియజేస్తే పరిష్కరిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. మద్యం సేవించి శోభా యాత్రల్లో పాల్గొనవద్దని, నిమజ్జన ప్రాంతాలకు చిన్న పిల్లలను తీసుకురావద్దన్నారు. పోలీసు శాఖ సూచనలు తప్పక పరించాలన్నారు.కులమతాలకు అతీతంగా భక్తి భవనతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని పలు సూచనలు చేశారు. మండపాల వద్ద పేకాట మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. సరైన మండపాల నిర్మాణం కోసం విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తగా తీసుకోవాలని నిరువకులకు సూచించారు.