కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా…..
- విద్యతో పాటు
- మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పిస్తున్న విద్యాసంస్థ
- మరెన్నో స్పెషల్ ప్రోగ్రాంలను నిర్వహించే విద్యాసంస్థ
- లిటిల్ ఫ్లవర్ హై స్కూల్

మెండోర( వెల్గటూర్), ఫిబ్రవరి 10 ( లోకం తీరు ) : నిజామాబాద్ , ఆర్మూర్ అర్బన్ ఎడ్యుకేషన్ కు ఏ మాత్రం తీసిపోకుండా వాటికి దీటుగా విద్యను అందిస్తున్నటువంటి ఏకైక విద్యాసంస్థ అయినటువంటి ” లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ” , ఒలంపియాడ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 2వ,3వ స్థానం సాధించినటువంటి విద్యాసంస్థ అంతేకాకుండా జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలలో రెండుసార్లు ప్రథమ బహుమతి సాధించి, జోనల్ మరియు జిల్లాస్థాయిలో ఎంపిక అయినటువంటి విద్యాసంస్థ.
ఇంగ్లీషు భాష పై పట్టు సాధించడం మరియు సులభంగా రాయడం వంటి ” స్పెషల్ ” బి ప్రోగ్రాంను నిర్వహిస్తున్నటువంటి ఏకైక విద్యాసంస్థ , మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింప చేసే విధముగా ప్రతి పండుగను వాటికున్న ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్టు వివరిస్తూ వచ్చే తరం పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పిస్తున్నటువంటి విద్యాసంస్థ, పిల్లల్లో ఉన్న స్టేజ్ భయం తొలగించి సెమినార్ క్లాసులు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పిస్తూ విద్యార్థినీ విద్యార్థులకు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ విజయపతంలో నడిపిస్తున్నటువంటి ఏకైక విద్యాసంస్థ.
లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నిర్మల్ లో జరిగిన విశ్వం ఎడ్యుకేషనల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రాష్ట్రస్థాయి స్కూల్ కాంపిటీషన్లో పాల్గొని మెడల్స్ ని సాధించి నిర్మల్ ఎస్సై ఐ శంకర్ చేతుల మీదుగా అవార్డులను స్వీకరించడం జరిగింది.