మహిళా శక్తి పై డిపియం, అడిషనల్ పీడీతో సమీక్ష సమావేశం
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 22 (లోకంతీరు):మహిళా శక్తి కార్యక్రమంపై గురువారం డిపిఎం, అడిషనల్ పిడి తో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
ఎస్ ఎచ్చ్ జి బ్యాంక్ లింకేజి ప్రోగ్రెస్ చాల తక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాల వారిగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పురోగతి సాదించాలని, లేకపక్షంలో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.మిల్క్ ఎనిమాల్, బ్యాక్యర్డ్ పౌల్ట్రీ లక్ష్యం ప్రకారం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.మైక్రో ఎంటర్ప్రైజెస్ గ్రౌండ్ పైన రివ్యూ చేసారు. ప్రతీ రోజు గ్రౌండింగ్ ప్రోగ్రెస్ ఉండాలని లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించారు. అలాగే జిల్లాలో 5 మహిళా శక్తి క్యాంటీన్ 20 రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. తదనంతరం మీ సేవా కేంద్రాలు గుర్తింపు చేసారు. గ్రౌండింగ్ కూడా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ చేసి స్కీముల గ్రౌండింగ్ కు బ్యాంకులలో సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు డిఆర్డిఓ మురళీ కృష్ణ, డిపిఎం లు రవీందర్ రావు, సుధాకర్, రమేష్ బాబు, వకుల పాల్గొన్నారు.