Take a fresh look at your lifestyle.

రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా….?

0 1,280

రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా….?

— ఇద్దరు పరిస్థితి విషమం…!

 — నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స..!

 

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (లోకంతీరు) : ఆస్తికోసం ఎంతకైనా తెగిస్తారు అనే నానుడి నిజమైంది. వివరాల్లోకి వెళితే ఆస్తికోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చెలరేగి ప్రాణాల మీదికి తీసుకువచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మంగలి మాధవ్, మంగళ శంకర్ ఇద్దరు అన్నదమ్ములు, ఎవరి వారు కొన్నేళ్లుగా వేరేగా ఉంటూ కుటుంబం ను పోషించుకుంటున్నారు. వారం రోజుల క్రితం వీరి తల్లి చనిపోయింది. తల్లి చావు ఖర్చులు, ఆస్తి విషయాల్లో మంగలి శంకర్, మంగలి మాధవ్ అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ మొదలు కావడంతో శంకర్ కొడుకులు మంగలి బాబులాల్, మంగలి శంకర్, మంగలి సుధాకర్, మంగలి గంగమని కుటుంబం మంగళి మాధవ్ కుటుంబం పై దాడికి పాల్పడ్డారు. తన తండ్రిపై జరుగుతున్న దాడిని చూసి మాధవ్ కుమారుడు రామ్ పారిపోయాడు. ఇద్దరు వృద్ధులైన మంగలి మాధవ్ పై, మంగలి నాగవ్వ పై విచక్షణ 

రహితంగా కర్రలతో, ఇటుక లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మాధవ్,

నాగవ్వ తీవ్రంగా గాయాల పాలయ్యారు. తీవ్ర గాయాలకు గురై నేలపై కొట్టుకుంటున్న పరిస్థితి చూడకుండా మంగలి బాబూలాల్, మంగలి శంకర్, మంగలి సుధాకర్ కర్రలతో, ఇటుకలతో దాడి చేయడంతో నాగవ్వ అపస్మార్క స్థితికి చేరుకుంది, తీవ్ర గాయాలతో మాధవ్ రోడ్డుపై పడి ఉండగా స్థానికులు వెంటనే వీరిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నాగవ్వ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, మాధవ్ కు తనకు బలమైన గాయాలు కావడం వల్ల ఇంకా కోల్కోలేదు. ఈ ఘటనకు ఆస్తితగాదాలే కారణమని స్థానికుల సమాచారం.

Leave A Reply

Your email address will not be published.