Take a fresh look at your lifestyle.

బీబీపేట మండల కేంద్రంలో విద్యార్థుల ధర్నా…

0 1,200

బీబీపేట మండల కేంద్రంలో విద్యార్థుల ధర్నా

 – సమయానికి ఆర్టిసి బస్సులు రావడం లేదని సుమారు గంట పాటు ధర్నా

కామారెడ్డి జిల్లా/ బీబీపేట, ఆగస్టు 24 (లోకంతీరు) : బీబీపేట మండల కేంద్రం నుండి కామారెడ్డి కాలేజీ సమయానికి బస్సులు రావడం లేదని మండల కేంద్రానికి సమీపంలోని విద్యార్థులు శనివారం సుమారు గంట పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం కామారెడ్డి డిఎం కి వినతి పత్రం అందజేసిన సరియైన స్పందన ఆర్టీసీ డిఎం పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు సరైన సమయంలో బస్సులు రాకపోవడం వల్ల మేము కళాశాలకు ఆలస్యంగా తరగతులు వెళ్లడం వల్ల తరగతులు తప్పుతున్నామన్నారు. అందుకోసం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని, ఎన్నిసార్లు డిపో మేనేజర్ కి చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవడంలేదని, ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటల నుండి 7:30 మాకు బస్సు వచ్చే విధంగా ఆర్టీసీ డిపో మేనేజర్ చూడాలని వారు పేర్కొన్నారు. కామారెడ్డి ఆర్టీసీ డిఎంకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు సమయానికి రావడం లేదని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం మొత్తానికే బస్సులు లేవు. కావున మాకు బస్సులు నడపాలని కోరారు. ఇంటర్ మీడియట్ విద్యార్థులకు బస్సులు రాక చాలా ఇబ్బంది అవుతుందని స్పష్టం చేశారు. బీబీపేట మండల కేంద్రానికి మళ్ళీ యధావిధిగా ఉదయం లోకల్, ఇస్సనగర్, మల్కాపూర్ బస్సులు నడపాలని విద్యార్థులు కోరారు. లేని పక్షంలో ధర్నా ను కొనసాగిస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.