Take a fresh look at your lifestyle.

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి……

0 1,213

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

– మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్

ఎల్లారెడ్డి,  సెప్టెంబర్ 1 ( లోకంతీరు ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజుల సురేందర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, శిథిలవ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసంలో ఉండవద్దని విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక నివాసం కొరకు మీ సమీప బంధువుల ఇంట్లో ఉండాలని లేక గ్రామంలో ఉన్న కమ్యూనిటీ భవనాలు ఉండాలని అలాగే కరెంట్ స్తంభాలను తాకరాదన్నారు. అలాగే ఇండ్ల పరిషత్ ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని వర్షాల ప్రభావం వలన విషసర్పాలు సంచరించే ప్రమాదం ఉన్నందున పెద్దలు చిన్నపిల్లలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. ముంపు ప్రాంత ప్రజలను అవసరమైతే సురక్ష ప్రాంతాలకు తరలించాలని, వరద ఉదుర్తి తగ్గేవరకు ప్రభుత్వ సహాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.