Take a fresh look at your lifestyle.

బొగ్గు పెన్షన్ పెంపు, రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు కల్పించాలి.

0 40

                                                                                                                                       బొగ్గు పెన్షన్ పెంపు, రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు కల్పించాలి.
కేంద్ర మంత్రులకు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, జూన్ 11:
బొగ్గు గని పెన్షన్ దారులకు పెన్షన్ పెంపుతో పాటు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రూకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో బొగ్గు గని పెన్షన్ దారుల కనీస పెన్షన్‌ను గణనీయంగా పెంచి వారికి ఆర్థిక భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సీపీఆర్‌ఎంఎస్ కార్డుల ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు గుర్తింపు పొందిన ఆసుపత్రుల సంఖ్యను పెంచాలని కోరారు. వైద్య బిల్లుల రీయింబర్స్‌మెంట్ ప్రక్రియను సరళీకృతం చేసి, త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్, ఉపాధ్యక్షుడు కంచె బీరయ్య, కోశాధికారి మేడూరి విజయబాబు పాల్గొన్నారు. బొగ్గు పెన్షన్ దారులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని అసోసియేషన్ నాయకులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.