Take a fresh look at your lifestyle.

రోడ్లపై ధాన్యం ఆరబెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం….

0 1,399

రోడ్లపై ధాన్యం ఆరబెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం

  • రోడ్లపై దాన్యం ఆరబెడితే కఠిన చర్యలు వేల్పూర్ పోలీసులు

బాల్కొండ , ఫిబ్రవరి  27 ( లోకంతీరు ) : బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం పోచంపల్లి గ్రామ శివారులో రోడ్లపై ధాన్యం ఆరవేస్తూ సామాన్య ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన బేకా తయారు చేస్తున్నారు. వన్నెల్ బి నుండి పోచంపల్లి గ్రామానికి స్కూల్ బస్సు వెళుతుంది మార్గమధ్యంలో పోచంపల్లి శివారులో జొన్నలు ఆరబెట్టి అక్కడే రోడ్డుపై జొన్న పొట్టును కాల్చి వేస్తూ రోడ్డుపైనే ఉంచడం జరుగుతుంది దీనివల్ల ప్రమాదాలు ఎదురైతే ఎవరి బాధ్యులు అని సామాన్య ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ధాన్యాన్ని ఆరబెట్టేముందు వెళ్లడానికి దారి వదిలి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేల్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ రెడ్డిని వివరణ కోరగా ఆయన ప్రజలను ఉద్దేశించి వేల్పూర్ ప్రజలకి పోలీస్ వారీ విజ్ఞప్తి. రోడ్ పైన ఎటువంటి ధాన్యాలు అరబోయకుడదు. దీని వలన రోడ్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయని పదే పదె చెప్పిడం జరిగింది. రోడ్ ప్రమాదాలు పైన అవగాహన కార్యక్రమాలు చేపిట్టిన కూడా రైతులు వినడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతు, సామాన్య ప్రజల ప్రాణాలు తీసే రాక్షసుడు కాకూడదు. రేపటి నుండి రోడ్ పైన ధాన్యం ఆరబోసిన మరియు రాళ్లు పెట్టిన అట్టి వారి పైన క్రిమినల్ కేసులు వేయబడును.

Leave A Reply

Your email address will not be published.