రాజకీయ విభాగం అధ్యక్షుడుకి సన్మానం

రామారెడ్డి ,సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన బారాస నాయకుడు ఆర్యవైశ్య జిల్లా మహాసభ రాజకీయ విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా నియమించబడ్డ పడగల శ్రీనివాసును బారాస నాయకులు గురువారం ఘనంగా సన్మానించారు. అంచెలంచెలుగా మరిన్ని పదవులు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, గాంధారి బారస మండల అధ్యక్షుడు వజీర్ శివాజీ రావు, కాలభైరవ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా, జిల్లా బీసీ నాయకుడు కళాలి సాయ గౌడ్, జిల్లా గిరిజన నాయకుడు లింబాద్రి నాయక్, తోపాటు పలువురు పాల్గొన్నారు.