Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ రన్నింగ్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక….

0 1,675

అంతర్జాతీయ రన్నింగ్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన యాద్గార్పూర్ వాసి.

  • జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించిన చంద్రశేఖర్ గౌడ్ (అర్.ఎస్.ఐ).
  • గ్రామీణ క్రీడలంటే ఆయనకు మక్కువ.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు) : ఈ నెల 8 నుండి 11 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన 5 వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ 2024 లోనీ 400 మీటర్ రన్నింగ్ అథ్లేటిక్స్ పోటీ లో కామారెడ్డి రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ స్వర్ణం సాధించారు.చంద్రశేఖర్ గౌడ్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్.ఆయన తండ్రి అంజాగౌడ్,తల్లి లక్ష్మి వీరికి నలుగురు సంతానం.మొదట ఇద్దరు కూతుర్ల తర్వాత చంద్ర శేఖర్ గౌడ్ మూడవ సంతానం. ఆయనకు చిన్నపటి నుండి పరుగంటే ఇష్టం.ఖాళీ సమయంలో పరుగు చేయాలనే ఉత్సహం ఎక్కువ.2018 లో ఆయన ఆర్ఎస్ఐగా జాబ్ సంపాదించి కామారెడ్డి ఎస్పీ ఆఫీసులో ఎంటీవోగా ఆరేళ్లు సర్వీస్ చేసి ప్రస్తుతం కామారెడ్డిలో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.కష్టపడి కొలువు సాధించి ఒక వైపు విధులు నిర్వర్తిస్తు మరోవైపు తన ఇష్టమైన పరుగును మాత్రం ఎక్కడ ఆపకుండా ఆన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటు,ఒకరకంగా చెప్పాలంటే ఆయనకు ఈ పరుగే ఉద్యోగాన్ని తెచ్చింది. అలాంటి తన పరుగును ఇంతటితోనే ఆపివేయకుండా దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు సన్నదమై తన వంతు కృషిగా తనకు అవకాశం వచ్చిన జాతీయ స్థాయి అథ్లేటిక్స్ పోటీలను సద్వినియోగం చేసుకొని స్వర్ణ విజేతగా నిలిచారు.అంతర్జాతీయ స్థాయిలో భారత దేశానికి పేరు తీసుకురావాలన్న లక్షంతో ఈ రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు.త్వరలో శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ అథ్లేటిక్స్ పోటీలో ఆయన పాల్గొననున్నారు.ఈ సందర్భంగా చంద్ర శేఖర్ గౌడ్ అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై పలువురు క్రీడ క్రీడాభిమానులు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.