అంగన్వాడీలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

కామారెడ్డి జిల్లా / రామారెడ్డి , జనవరి 26 (లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంగన్వాడి సెంటర్ లలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏండ్లు పూర్తయి 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంతోమంది అమరవీరుల త్యాగపరమే మన స్వేచ్ఛ స్వతంత్రం, అదేవిధంగా బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి మనకంటూ సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకొని అమలులోకి వచ్చిన సందర్భంగా భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.