అంబేద్కర్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.
-
మాజీ సర్పంచ్ మీర్జాపూర్ చిన్న సాయన్న.

బాన్సువాడ /కోటగిరి, ఏప్రిల్ 20 ( లోకంతీరు ) : జ్ఞాన సముద్రం లాంటి బాబా సాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని వివరించడం కష్టమని,ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఉమ్మడి కోటగిరి మండల మాల, మహానాడు అధ్యక్షులు,మాజీ సర్పంచ్ మీర్జాపూర్ చిన్న సాయన్న పేర్కొన్నారు. శనివారం డా.బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతినీ పురస్కరించుకొని కోటగిరి మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు,ప్రజలు,అంబేద్కర్ వాదులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ పలువురు బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలిపి గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులకు,గ్రామ పెద్దలకు ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.భారతరత్న,మన దేశ రాజ్యాంగ రూపకర్త డా.బి. ఆర్.అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకోవాలన్నారు.బడుగు, బలహీన వర్గాలు,మహిళల సాధికారతకు పాటు పడిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.ఇటీవల ఐక్యరాజ్యసమితిలో అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం మనకందరికీ గర్వకారణమని అన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కత్తిని కాకుండా ఓటును కల్పించి తద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసిన మహానీయులని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సునంద,మల్లెపూల హనుమా గౌడ్,గడ్డం నాగేష్,గడ్డం శ్రీనివాస్, సరోజ,శాంతా,శోభ, ఆంజనేయులు,సంగెం శ్రీకాంత్,గైని రవి,భూమేష్,హరికుమార్, రంజిత్,డాన్ శీను,అన్వేష్,గైని రాజయ్య,గైని గంగారం,సంజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.