ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం నిర్వహణ: కలెక్టర్ దివాకర టీఎస్
మండల స్థాయిలోనే సమస్యలు, వినతులు సమర్పించాలి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, ఆగస్టు 15: ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను ఆయా మండలాల్లో నిర్వహించే ప్రజావాణిలో సంబంధిత అధికారులకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి మండల స్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నందున, సమస్యలు, వినతులు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను మండల స్థాయిలోనే ప్రజావాణి ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
Recover your password.
A password will be e-mailed to you.