Take a fresh look at your lifestyle.

రామారెడ్డి మండల బంద్ విజయవంతం….

0 1,092

రామారెడ్డి మండల బంద్ విజయవంతం

రామారెడ్డి , ఆగస్టు 17 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామారెడ్డి మండల బందుకు పిలుపునిచ్చారు.ఇందుకు గాను ఉదయం నుండి వ్యాపార సముదాయాలు అన్ని రకాల వాణిజ్య వ్యాపార స్థానిక సంస్థలు, స్థానిక ప్రజలు ప్రశాంత వాతావరణంలో మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలో బంద్ ను విజయవంతం చేశారు. హిందూ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను ఖండిస్తూ, ఈ మండల బందుకు పిలుపునివ్వడం జరిగిందని, ప్రభుత్వం స్పందించి అక్కడున్న ప్రవాస భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా, వారిపై దాడులను ఆపివేయాలని ప్రభుత్వానికి నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆయా యువజన సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.