Take a fresh look at your lifestyle.

పండుగలు ఐకమత్యానికి వేదికగా నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని.

0 2

పండుగలు ఐకమత్యానికి వేదికగా నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని.
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, సెప్టెంబర్ 14: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ పండుగలు, ఉత్సవాలను ఐకమత్యంతో నిర్వహించుకోవడం ద్వారా మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా పాల్వంచ పట్టణ పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన పలు మండపాలను సోమవారం కూనంనేని సాంబశివరావు సందర్శించి, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో పేద వర్గాలను భాగస్వామ్యం చేసి వారిలో సంతోషాన్ని నింపాలని కోరారు. ప్రజాస్వామ్య భారతదేశంలో కులమతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలు జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. ప్రజలు భక్తిమార్గాన్ని ఎంచుకోవడం వల్ల రాగద్వేషాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజంలో శాంతి నెలకొనే అవకాశం ఉంటుందని అన్నారు. ఉత్సవ కమిటీలు భారీ మొత్తంలో వెచ్చించి వేడుకలు నిర్వహించడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించి పలువురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ శాఖల సూచనలు, నిబంధనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవ మండపాలను సందర్శించిన కూనంనేని సాంబశివరావును కమిటీ సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కంచర్ల జమాలయ్య, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, గొర్లె అన్నపూర్ణ, నామ కీర్తి, నూనావత్ శ్యామల, నాయకులు మన్యం వెంకన, శనగారపు శ్రీనివాస్, యండి యూసఫ్, కోరే కృష్ణ, జకరయ్య, ఆలపాటి ప్రసాద్, నామ పండు, నవీన్, గొర్లె నరేష్, కాకటి రవీందర్, ఏ.ఎస్.ఎన్. వెంకటేశ్వర్లు, అంబడిపూడి నరేంద్ర, వెంకటేష్, పృథ్వీ, లావుడ్య చందూలాల్, అల్లి వెంకటేశ్వర్లు, షేక్ లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.