Take a fresh look at your lifestyle.

తాడిచెట్ల తొలగింపును నిలిపివేయాలని ఎమ్మెల్యేకు గౌడ సంఘం వినతి.

0 5

తాడిచెట్ల తొలగింపును నిలిపివేయాలని ఎమ్మెల్యేకు గౌడ సంఘం వినతి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 1: జయశంకర్-భూపాలపల్లి జిల్లా  కోడెపాక గ్రామ శివారులోని బాలయ్యపల్లి ప్రాంతంలో విద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా తాడిచెట్లను తొలగించే చర్యలను నిలిపివేసి, గౌడ కులస్థుల జీవనోపాధిని కాపాడాలని గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కోరారు. విద్యుత్ లైన్ పనుల కోసం పెద్ద సంఖ్యలో తాడిచెట్లను తొలగించే పరిస్థితి ఏర్పడటంతో గౌడ కుటుంబాలు తమ ప్రధాన జీవనాధారమైన కల్లుగీత వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉందని గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తాడిచెట్లపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ గౌడ సంఘం చైర్మన్ కక్కెర్ల సంపత్ గౌడ్, అధ్యక్షులు కొత్తకొండ భానుతేజ గౌడ్, ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు గట్టు ప్రదీప్ గౌడ్, కునూరి రాజేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ తదితరులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. గౌడ సంఘం నాయకుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తాడిచెట్లను తొలగించకుండా తగిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు సూచనలు ఇచ్చారు. గౌడల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.