Take a fresh look at your lifestyle.

గణతంత్ర దినోత్సవ వేడుక…కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం

0 1,193

75వ గణతంత్ర దినోత్సవ వేడుక

  • సంఘ అధ్యక్షులు చింత కొండల్

నిజామాబాద్ అర్బన్ , జనవరి 26 ( లోకం తీరు ) : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 41వ డివిజన్ లో గల చంద్రశేఖర్ కాలనీలోని కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం నందు సంఘ అధ్యక్షులు చింత కొండల్ జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాత శ్రీనివాస్, కోశాధికారి కాటిపల్లి ప్రేమ్ కుమార్, గౌరవ అధ్యక్షులు జొన్న సత్యనారాయణ తో పాటు సంఘ సభ్యులు మరియు మహిళా సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎంతోమంది పోరాట వీరుల త్యాగఫలమే మన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మనం… మనకంటూ సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘భారత గణతంత్ర దినోత్సవం’. భారత గణతంత్ర దినోత్సవం ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు అని అన్నాడు.

Leave A Reply

Your email address will not be published.