అక్రమంగా తరలిస్తున్న ఇసుక టాక్టర్ పట్టివేత

బాన్సువాడ/కోటగిరి, జనవరి 27 ( లోకం తీరు ) :- బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు మంజీర నది నుంచి యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పోతంగల్ గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ ను కోటగిరి పోలీసులు పట్టుకున్నారు.తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు ఇసుక ట్రాక్టర్ అప్పగించడం జరిగిందని ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.ఉమ్మడి మండలంలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని ఆయన అన్నారు.