Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పనుల పరిమిషన్ పేరుతో ఇసుక అక్రమ రవాణా.

0 1,633

కోటగిరిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న రెవెన్యూ సిబ్బంది.

  • ప్రభుత్వ పనుల పరిమిషన్ పేరుతో ఇసుక అక్రమ రవాణా.
  • కఠినమైన చర్యలు తప్పవని ఎమ్మార్వో ప్రభాకర్.

బాన్సువాడ/కోటగిరి, జనవరి 30 ( లోకం తీరు ) : ఉమ్మడి కోటగిరి మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.ప్రభుత్వ పనుల పేరుతో టాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుక రవాణాను చేస్తున్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఇతరేతర ప్రభుత్వ పనుల పేర్లతో పరిమిషన్ తీసుకొని టాక్టర్ యజమాను లు దళారులతో కుమ్మకై వేరే నిర్మాణాల కోసం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న టి.ఎస్.27ఏ.0136 ఇసుక ట్రాక్టర్ ని కోటగిరి రెవెన్యూ సిబ్బంది పట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎమ్మార్వో ప్రభాకర్ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.