Take a fresh look at your lifestyle.

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు…అంతా సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం..!

0 1,707

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

– పది సంవత్సరాల తర్వాత స్పెషల్ ఆఫీసర్ ల పాలన..!
– ముగిసిన గ్రామా పంచాయితీ పాలకవర్గాల గడువు..!

– స్పెషల్ ఆఫీసర్ లు గేజిటెడ్, నాన్ -గేజిటెడ్అధికారులు
– బాధ్యతలు స్వీకరించన నున్న ప్రత్యేక అధికారులుగా
– అంతా సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 01 ( లోకం తీరు ) : రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన గ్రామ పాలకవర్గ కాలం ఐదు సంవత్సరాల పదవి కాలం గడిచిన సందర్భంగా గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలనకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ఆయా మండలాలలో ప్రత్యేక అధికారుల ను నియమించారు. ప్రత్యేక అధికారులుగా గేజిటెడ్ హోదా కలిగిన అధికారుల ను నియమించారు. జనవరి 31 తో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియడంతో పల్లెల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్ళింది . కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేకపోవడంతో పదేళ్ల తర్వాత మళ్లీ గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభం కానుంది. పంచాయతీల పాలక మండలి గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు సుముఖంగా లేదు..? దింతో మండల పరిషత్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, ఉపాధి హామీ, వ్యవసాయ, మిషన్ భగీరథ, మిషన్ భగీరథ గ్రిడ్, పశు వైద్య, ఐకేపీ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, విద్య, ఐసీడీఎస్, ఉద్యానవన తదితర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రత్యేక అధికారులుగా నియమించారు .కానీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను తక్కువ గా నియమించారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీల్లో గెజిటెడ్ అధికారులైన ఎంపీడీవోలు, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లు, ఎంపీఓలు, మండల వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ ఏఈలు, పీజీహెచ్ఎంలు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.కాగా చిన్న గ్రామపంచాయతీల్లో ఐసీడీఎస్ ఉద్యోగులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, ఉపాధి హామీ, ఐకేపీ, ఏఈవోలు, తదితర శాఖల ఉద్యోగులు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.వీరు సర్పంచుల స్థానాల్లో ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహించనున్నారు.

ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పదవి కాలం..!

2019 ఫిబ్రవరి నెలలో కొలువుదీరిన పాలకవర్గాల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసిపోవడంతో . గడువు తీరేలోపు ఎన్నికలు నిర్వహించాలి. కానీ పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం పంచాయతీల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు మండలంలోని ఆయా గ్రామాలకు ఎంపీడీవో, తహసీల్దార్‌, ఎంపీవో, డీటీ, ఆర్‌ఐ, ఇంజినీర్లు, ఇతర గెజిటెడ్‌ జూనియర్ అసిస్టెంట్ అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా ఉన్నతాధికారులు నియమించారు.సర్పంచుల ఆధీనంలో ఉన్న డిజిటల్‌ కీలు, చెక్కులు, ఇతర రికార్డులన్నంటినీ స్వాధీనం చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక అధికారికి, కార్యదర్శికి ప్రభుత్వం జాయింట్‌ చెక్‌ పవర్‌ అవకాశం కల్పించింది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఆయా గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లను నియమించింది.

Leave A Reply

Your email address will not be published.