బాల్క సుమన్ నోటికి అదుపు లేకుండా మాట్లాడితే నాలుక చీరేస్తాం.

బాల్కొండ , ఫిబ్రవరి 06 ( లోకం తీరు ) : బాల్కొండ మండల కేంద్రం లో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వాక్యాలను తీవ్రంగా కండించారు, కెసిఆర్ బానిసలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో నిమగ్నమై ముందుకు పోతుంటే దాన్ని జీర్ణించుకోలేని ఈ కల్వకుంట్ల మిడతల దండు వారి బానిసలచే తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తున్నారు.
దొర గడీల దగ్గర ఎంగిలి మెతుకులకి ఆశపడి బ్రతికే బాల్క సుమన్, ఓడిపోయామన్న అక్కసుతో ప్రజా పాలనని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచితంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాము అని తెలిపారు.
వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలన్నారు.
బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ళు హామీల అమలుపై ఏనాడు మాట్లాడని మాజీ మంత్రి శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి , కేవలం దొర ఎప్పుడు బౌ అనమంటే అప్పుడు అనుకుంటూ బ్రతికాడు,
స్వయాన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి బాల్కొండ నియోజకవర్గనికి ఇండ్లు ఇప్పియ్యలేని అసమర్ధ మంత్రిగా మిగిలిపోయింది మీరు కాదా దళితులకి మూడెకరాల హామీ విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ ఏనాడు పల్లెత్తి మాట మాట్లాడని బాల్క సుమన్ ఇవాళ అధికారం పోయేసరికి బిఆర్ఎస్ నాయకులు రెండు నెలలకే పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాగే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడితే నాలుక చీరెస్తాము.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసిఎల్ జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు జావిద్ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రవీణ్,కపిల్, జక్క రాజలింగం, బాల్కొండ గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, సంతోష్ గౌడ్ బద్రి, కిసాన్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, బుపి, హలీం పాల్గొన్నారు.