ప్రజా సేవలో తనకు సాటి ఎవరూ లేరు
– ఎంపీ బీబీ పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : అధికార దర్పం ఏమాత్రం కనిపించకుండా సాధారణవ్యక్తిగా ప్రజల్లో తిరుగుతూ తన ని ఏం పి గా గెలిపించారు. వారి రుణం ఏ విధంగా తీర్చుకోవాలో పది సంవత్సరాల్లో ఎన్నో కొత్త ప్రాజెక్టులు తెచ్చి జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి వన్నెతెచ్చిన వ్యక్తి బీబీ పాటిల్ నిరూపించారు.దేశంలో ఎంతోమంది ఎంపీలు ఉన్నపటికి అంకిత భావం అవినీతి రహితంగా తన ప్రాంత అభివృద్ధి ద్యేయంగా పనిచేశారు.అందుకు నిదర్శనం పార్లమెంట్ పరిధిలో రెండు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయించి మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్,మద్నూర్ ప్రాంత విద్యార్థుల కు సెంట్రల్ సిలబస్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇవే కాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కేంద్రంలో కోట్లాడి సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.అంతేకాకుండా ప్రజా సమస్యలపై అత్యున్నతమైన పార్లమెంట్లో తనదైన శైలిలో 433 ప్రశ్నల వర్షం కురిపించి ఇటు ప్రజా సమస్యల పరిష్కారం,అటు ప్రభుత్వ పెద్దల దృష్టిని ఆకర్షించి ఎన్నో పథకాలను సాధించారు. కానీ ఎలాంటి అర్బాటం లేకుండా తానేదో చేసినన్ని గొప్పలు చెప్పకుండా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే తన జీవితం ధన్యమైనట్లేనని భావించే వ్యక్తుల్లో బి బి పాటిల్ తెలిపారు.తన పార్లమెంట్ నియోజకవర్గంలో నేషనల్ రూబిన్ పథకం కింద రాయక్కల్,జుక్కల్ మండలాల్లో 362. 83 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్లు పేర్కొన్నారు అలాగే అమృత్ భారత్ పథకం కింద కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికరణకు 39.90 కోట్లతో అలాగే జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణకు 24.35 కోట్లతో పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా జహీరాబాద్ కామారెడ్డి రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించినట్లు తెలిపారు.ఆదర్శ గ్రామ యోజన పథకం కింద కౌలాస్ జరా సంగం 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.అంతేకాకుండా నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి 86 లక్షల వ్యయంతో బిచ్కుంద,కోహినూర్,జోగిపేట్,నారాయణఖేడ్,దోమకొండ,మద్నూర్ ఆసుపత్రులకు అంబులెన్స్ కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాస్ ఫోటోఆఫీసు నెలకొల్పడం జరిగిందని అన్నారు.అలాగే మద్నూర్ పోస్ట్ ఆఫీస్ భవనం నిర్మించడం జరిగిందన్నారు.
వికలాంగుల కోసం ఒక కోటి 77 లక్షలతో బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందని అందులో 70 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు అయితే 30% ఎంపీ నిధులు అన్నారు.26 కోట్ల 79 లక్షలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అందుకు మ్యాచింగ్ గ్రాంట్ కింద ఎంపీ నిధులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.