Take a fresh look at your lifestyle.

అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత….

0 1,800

అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 7 ( లోకం తీరు ) : కామారెడ్డి పట్టణంలో మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 22.40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. రాజీవ్ నగర్ కు చెందిన రేవూరి ప్రభాకర్ వద్ద 9.15 క్వింటాళ్ల, జెపియన్ రోడ్లు కోడి ప్యాక శ్రీనివాస్ వద్ద 2.25 క్వింటాళ్లు, కిష్టమ్మ గుడి సమీపంలో మమ్మద్ అజిజ్ వద్ద 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిఎస్ఓ మల్లికార్జున బాబు, డిప్యూటీ తాసిల్దార్ కిష్టయ్య ఆధ్వర్యంలో బుధవారం పంచనామ నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.