Take a fresh look at your lifestyle.

ప్రత్యేక అధికారిని సన్మానించిన ఎం.ఏ హకీమ్…

0 1,545

ప్రత్యేక అధికారిని సన్మానించిన ఎం.ఏ హకీమ్.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 13 ( లోకంతీరు) : ఇటీవల సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కోటగిరి మండలం ఎంఈఓ నాగనాథ్ పోతంగల్ మండల జల్లాపల్లి ఫారం గ్రామ పంచా యతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని గ్రామపంచాయతీ  కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ఎం.ఏ హకీమ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక అధికారి నాగనాథ్ ను శాలువతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ అందరి సమిష్టి నిర్ణయం మేరకు గ్రామ అభివృద్ధి ప్రణాళికను రూపొందించి గ్రామ అభివృద్ధికై పాటుపడతానని ఆయన అన్నారు.అలాగే మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ.గ్రామ సమస్యలపై ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన ప్రత్యేక అధికారికి సూచించారు.గ్రామ అభివృద్ధి లో తన యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన అన్నారు.అనంతరం ఎం.ఏ హకీమ్ ప్రత్యేక అధికారులతో కలిసి గ్రామంలోని ప్రభుత్వ ఉర్దూ తెలుగు మీడియం పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా తెలుగు మీడియం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని వారు ఇరువురు పరిశీలించారు.తదనంతరం గత నెల రోజుల నుండి గ్రామం లోని ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందక అనేక ఇబ్బందులకు గురైతున్న త్వరునంలో ఎం.ఏ హకీమ్ తన పుట్టి పెరిగి చదువుకున్న ఊరిపై మమకారంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నెల రోజులకు సరిపడా మధ్యాహ్న భోజన సరుకులను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజేశ్వరి,తాజా మాజీ సర్పంచ్ షేక్ షేరు,తెలుగు,ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుకుణాకర్,వజాహత్ హునిస్సా,కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ ప్రెసిడెంట్ వాజిత్,మాజీ ఎంపీటీసీ ఆసిఫ్,మాజీ ఉప సర్పంచ్ మస్తాన్,మాజీ వార్డ్ మెంబర్ అబిబ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్,బాబా, ఇస్మాయిల్,యశ్వంత్, ఇబ్రహీం,రాములు,తస్లీమ్ ఖాన్,జలీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.