Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

0 2

టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15:


భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారుయూనియన్ అధ్యక్షుడు రడపాక రమేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. టాక్సీ డ్రైవర్ల సంక్షేమం, ఐక్యత కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నవీన్ నాయక్, గోరే పాషా, రాజు, శ్రీనివాస్, నజీముద్దీన్, సురేష్, రఘుపతి, సాగర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.