బాల్కొండ నుండి అయోధ్య యాత్ర కు బయలుదేరి వెళ్లిన బీజేపీ నాయకులు

బాల్కొండ , ఫిబ్రవరి 13( లోకంతీరు ) : భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యకర్త ల కోసం అయోధ్య బాల రాముని దర్శనం కోసం రైలు ఏర్పాటు చేయడంతో బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో 32 మంది బీజేపీ నాయకులు అయోధ్య యాత్రకు బయలుదేరివెళ్లారు. అధ్యక్షులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నుండి అయోధ్య వరకు ఆస్థా రైలు ను ఏర్పాటు చేసి నామమాత్రపు రుసుము తో కార్యకర్తలకు అన్ని సదుపాయాలు కల్పించి దర్శనం చేయించి తీసుకురావడం బీజేపీ కార్యక్తల కోసం మంచి నిర్ణయం తీసుకుందని, హైదరాబాద్ నుండి వెళ్లే రైలును ఎంపీ ధర్మపురి అరవింద్ గారి చొరవతో నిజమాబాద్ కార్యకర్తలా కోరిక మెరకు నిజామాబాద్ నుండి ఏర్పాటు చేసినందుకు అరవింద్ గారికి దన్యవాదములు తెలిపారు. అలాగే ఈ యాత్ర ఇంచార్జ్ అయినా అమ్డాపూర్ రాజేష్ గారిని అధ్యక్షులు అంబటి నవీన్ శాలువాతో సన్మనించారు. యాత్ర వెళ్లిన వారిలో బిజెపినాయకులు నక్కల గణేష్, ఆరెపల్లి నర్సయ్య, రామన్ శివ, భూమేష్, రాజేశ్వర్, రాము, ప్రవీణ్, శివానంద్, గంగాధర్, శరత్, నరేందర్ తదితరులు వెళ్లారు.