బిఆర్ఎస్ నుండి బిజెపి లొకి వలసల ప్రారంభం.
- ఇందూర్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన
- ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ ,ఫిబ్రవరి 13 ( లోకంతీరు ) : భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు మున్సిపల్ లోని 39 & 50 డివిజన్ లకు చెందిన నిచ్చెంగ్ లత & కృష్ణ, బట్టు రాఘవేంద్ర బిఆర్ఎస్ కార్పొరేటర్లను బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్బంగా ధన్ పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి కేవలం నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి తోనే సాధ్యం అవుతుందని నమ్మి ఈ రోజు పార్టీలో నూతనంగా చేరిన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఇందూర్ పార్లమెంట్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు,బిఆర్ఎస్ బానిస సంకెళ్లు తెంచుకొని బిజెపి లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్ కార్ లక్ష్మీనారాయణ, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, మరియు కార్పొరేటర్లు మెట్టు విజయ్, సుక్క మధు, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, వెల్డింగ్ నారాయణ, పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, పుట్ట వీరేందర్, పార్టీ నాయకులు బట్టి కిరి ఆనంద్, శివునూరి భాస్కర్ చిరంజీవి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.