ఫిబ్రవరి 19 న శివాజీ జయంతి కి సెలవు ప్రకటించాలి

నిజామాబాద్ అర్బన్, ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించాలని శ్రీ శివాజి మహరాజ్ సేవా సమితి ఇందూర్ కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీ శివాజి మహరాజ్ సేవా సమితి ఇందూర్ అధ్యక్షులు లక్ష్మణరావు పాటిల్ మాట్లాడుతూ శివాజీ లౌకిక పాలకుడు, అన్ని వర్గాల ప్రజలను బాగా చూసుకునేవారు అని, నిస్వార్థంగా ప్రజలకు సేవచేసే వారు అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19 న రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివాజి మహరాజ్ సేవా సమితి ఇందూర్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.