తెలంగాణ,మహారాష్ట్రాల సరిహద్దుల్లో మంజీర ఇసుక అక్రమ రవాణా జోరు.
- పలు సందేహాలు రేకెత్తిస్తున్న అంతర్రాష్ట్ర ఇసుక అక్రమ రవాణా.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : తెలంగాణ,మహరాష్ట్రా సరిహద్దుల్లో బంగారంలాగా మారిపోయిన మంజీర ఇసుక ను అక్రమంగా రవాణా చేస్తు మితిమీరిన స్థాయిలో అక్రమా ర్కులు చేస్తున్నారు.ప్రజా సంపదను ప్రభుత్వం తరపున కాపాడుకునే వారు కళ్లప్పగించి చూస్తూ ఉంటే ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగి పోతున్నది.కొన్ని టన్నుల బరువుతో రహదారిపై తిరుగుతున్న ఇసుక టాక్టర్లు, బొలోరాలు అధికారులకు మాత్రం కంటికి కనిపించని అదృశ్య వాహనాలుగా మారి పోయాయి.ఒకటి కాదు రెండు కాదు రోజు పదుల సంఖ్యలో వాహనాలు ఇసుక అక్రమ రవాణా సాగిస్తుంటే అధికారులకు అవేమీ కనిపించకుండా ఉండటానికి కాసుల కక్కుర్తి కంటే మించిన కారణమేదీ కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని పోతంగల్, కొడిచర్ల,కల్లూర్ సరిహద్దు నుంచి మంజీర ఇసుక దోపిడీకి గురవుతోంది.ఇటు తెలంగాణ, అటు ఎంఎచ్ లోని అక్రమార్కు లు కలిసి కుమ్మక్కై సాగిస్తున్న ఈ అక్రమదందా ప్రతిరోజూ లక్షల్లో కొనసాగుతోంది.గతం లో మహారాష్ట్రకు చెందిన ఇస్కామాఫియాదారుల దోపిడిని అడ్డుకట్ట వేయడానికి పలు వార్తాపత్రికల్లో పలు కథనాలు వచ్చాయి.ఈ కథనాలకు ఉన్నత అధికారులు స్పందించి కొన్ని రోజులపాటు పోలీస్ పికేటింగ్ను ఏర్పాటు చేశారు.తదనంతరం కొన్ని రోజుల తరువాత అధికారులు పీకేటింగ్ ఎత్తివేశారు.అయిన ఇసుక బకాసురులు మళ్ళీ ఇసుకను దోచుకోవడం ప్రారంభించారు.ఇటీవల కోటగిరి పోలీసు వారు ఇసుక టాక్టర్లను పట్టుకున్న సందర్భంలో భాగంగా మరల ఇసుక దోపిడీ ఏ రేంజిలో సాగుతుందో? ఊహించు కోవచ్చు.ప్రస్తుతం ఈ వ్యవ
హారం పోలీసు,మైనింగ్, రెవెన్యూ అధికారులకు మధ్య నలుగుతున్నా ఏ మలుపు తిరుగబోతోందనేది ఆసక్తికరం గా మారింది.
ఇసుక అక్రమంలో అధికారుల ప్రేక్షకపాత్రపై అనుమానాలు.
తెలంగాణ,మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల నుంచి ఇంత భారీగా ఇసుక అక్రమ వ్యాపారం కొనసాగుతుంటే ఇక్కడ రెండు జిల్లాల అధికారులు ఏంచేస్తున్నారనేది అంతులేని అనుమానాలకు తావిస్తోంది.ప్రధానంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల పరిధిలోని మంజీర ఇసుకను కామారెడ్డి జిల్లా బిచ్కుంద నియోజక వర్గం మద్నూర్ మండల పరిధిలో నుంచి యధేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ ఇసుక దందాను నిరోధించేందుకు ఆ రెండు జిల్లా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు.దీంతో తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని కొందరు లీడర్లు, వ్యాపారులు కలిసి ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. మంజీర నదిలో ఇసుక ర్యాంపులు అక్రమంగా ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర కూలీలతో పెద్ద మొత్తంలో ఇసుకను తోడేసి మహారాష్ట్రలో అమ్ముకుంటున్నారు.ఈ అక్రమ దందాకు అడ్డుకట్టవేయాల్సిన పోలీసు,మైనింగ్,రెవెన్యూ, శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్న తీరు చూస్తుంటే ఈ దందాకు ఏ మేరకు సహకరిస్తున్నారా? లేదా అనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికైనా పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన పికేటింగ్ను ఏర్పాటు చేసి ప్రతిరోజు పూర్తిస్థాయి తనిఖీలు కొనసాగించాలని మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.