జంతువుల పాలిట దేవుడు ………డాక్టర్ జియావుద్దీన్
- అందరూ మనుషులను ప్రేమిస్తే…..
- పరిపాలన విభాగంలో తనకు తానే సాటి……
- ఈ వ్యక్తి మాత్రం తన వృత్తినే దైవంగా భావించి ….
- జంతు ప్రేమికుడే కాకుండా జంతువుల పట్ల దేవుడిగా మారాడు ఆ వైద్యుడు….

నిజామాబాద్ , ఫిబ్రవరి 19 ( లోకంతీరు ): నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ కేంద్రములో ఉన్న ఏరియా వెటర్నరీ హాస్పిటల్ లో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జియావుద్దీన్ . తన వృత్తి పట్ల ఉన్న ప్రేమతో జంతు ప్రేమికుల మన్ననలు పొందుతూన్నారు. ఆయన ప్రాంతంలో ఉన్న ఏ జీవికి కష్టాలు వచ్చిన వెంటనే స్పందిస్తూ..రైతులకు,జంతు ప్రేమికులకు , ఆ ప్రాంత ప్రజలకు దేవుడిగా మారాడు. ఏమైనా పశువులకు, జంతువులకు సమస్య వచ్చిందంటే గుర్తుకొచ్చేది అక్కడ ఉన్నటువంటి సహాయ సంచాలకులు జియాయోద్దీన్ గారే.. నాలుగు సంవత్సరాలుగా సేవలందిస్తూ అనేక మంది రైతులకు దేవుడిగా మారాడు. గత నాలుగు సంవత్సరాల క్రితం బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్కడ జంతు జాతికి ఉన్నటువంటి సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు కృషి చేశారు. అంతేకాకుండా తగు సూచనలు సలహరిస్తూ అవగాహన సదస్సులను నిర్వహిస్తూ ప్రజలందరినీ చైతన్యపరిచారు. ముఖ్యంగా పశువులకు వచ్చే కుంటు వ్యాధి గురించి అందరూ రైతులకు అవగాహన కలిగించి వాటికి తగిన చికిత్స నిర్వహించి జంతువులను బాగు చేసుకున్నారు. అలాగే నట్టల మందులు,వివిధ రకాల వ్యాక్సిన్సు అందుబాటులో ఉంచుతూ సమస్యల వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
ఆర్మూర్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పివిసి సెంటర్లో (ప్రైమరీ వెటర్నరిసెంటర్ల )లో సమస్యలు పరిష్కారం కాకపోతే ఆర్మూర్ లో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలివస్తున్నారు. రైతులు జంతు ప్రేమికులు ఆర్ముర్ చుట్టుపక్కల ఉన్నటువంటి పెర్కిట్,సుబ్రియల్,పిప్రి పివిసి సమస్యలు పరిష్కారం కాకుంటే ఆర్మూర్ చేరుకుని వైద్యం చేయించుకుంటున్నారు జంతు ప్రేమికులు. ముఖ్యంగా కుక్కలకు టీకాలు వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు. అదేవిధంగా పశువులకు ,గేదెలకు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ రైతులకు సూచనలు ఇస్తున్నారు. తగినంత సిబ్బంది లేకపోయినా ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకుంటూ జంతువులకు ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటున్నారు. అంతే కాకుండా సమస్యల పైన అవగాహనతో పాటు జంతువుల యొక్క జంతు ప్రేమికుల యొక్క ఫీడ్ బ్యాక్ తీసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు .
ఎమర్జెన్సీ సమయంలో డోర్ సర్వీస్ కూడా ఈయన ఇస్తున్నారంటే ఆయనకా జంతువుల పైన ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్ధం అవుతుంది. పరిపాలన విభాగంలో తనకు తానే సాటి…… తన విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా కార్యాలయంలో ఫీడ్బ్యాక్ రిజిస్టర్ , డోర్ రిజిస్టర్ ,డైరీ ఫామ్ రిజిస్టర్ ,సెంట్రల్ స్టాక్ రిజిస్టర్, డాగ్స్ వ్యాక్సిన్ రిజిస్టర్ , పశువుల వ్యాక్సిన్ , పౌల్ట్రీ వ్యాక్సిన్ రిజిస్టర్ తో పాటు రెగ్యులర్ హెచ్ ఎస్ బి క్యూ రిజిస్టర్, ఎఫ్ ఏం ఓ వ్యాక్సిన్ రిజిస్టర్ , ఎల్ ఎస్ డి తదితర రకాలు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.నాలుగు సంవత్సరాల క్రితం ఒకే డైరీ ఫామ్ ఉంటే ప్రస్తుతం 13 డైరీ పామ్ లో ఇతని ఏరియా లో ఉన్నాయంటే..ఇతనికి తన వృత్తిని ఎంత ప్రేమిస్తున్నారో ఇట్టే అర్థం అవుతుంది..