Take a fresh look at your lifestyle.

శ్రీ మైసమ్మ త్రిశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం.

0 4

శ్రీ మైసమ్మ త్రిశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, అక్టోబర్ 12: ఖమ్మం నగరంలోని రాతి దర్వాజా సెంటర్‌లో శ్రీ మైసమ్మ త్రిశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్ తోట రామారావు, పగడాల నాగరాజు, బత్తుల మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని, అన్నదానం మహాదానమని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నదాత వంశీతో పాటు చంటి, తోడేటి లింగరాజు, పగిళ్లపల్లి రాజు, నాని, వెంకటేశ్వర్లు, రాంబాబు, మహేష్, చిన్ని, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భవానీ మాతలకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.