Take a fresh look at your lifestyle.

పొద్దు తిరుగుడు విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభిచాలి….

0 1,340

పొద్దు తిరుగుడు విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభిచాలి

• ప్రయివేట్ మార్కెట్ లో అమ్ముకొని రూ.2వేలు నష్టపోతున్న రైతులు…

• ప్రభుత్వం చొరవ చూపి కొనుగులు కేంద్రాన్ని ప్రారంభించాలని …….. బిఆర్ ఎస్ డిమాండ్.

సిద్దిపేట,ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) : సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పొద్దు తిరుగుడు విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలాని బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సూడా డైరెక్టర్, సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఈ సందర్బంగా మాట్లాడుతు సిద్దిపేట లో 3వేల ఎకరాల్లో పత్తి పంట సాగు జరిగిందన్నారు, జిల్లా లో 10వేల ఎకరాల పైన సాగు జరిగింది…పంట మార్పిడి లో భాగంగా రైతులు పొద్దు తిరుగుడు సాగు చేసుకున్నారు. గత సంవత్సరం దాదాపు 4వేల మంది రైతులు 37వేల 900క్వింటాల్లా పొద్దు తిరుగుడు పండించారు. గౌరవ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హారిష్ రావు గారి ప్రత్యేక చొరవ తో గత సంవత్సరం రాష్టం లోనే మొదట మన సిద్దిపేట లో మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించమన్నారు. ఈ సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గం లో దాదాపు 2వేల మంది రైతులు 3వేల ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగు చేశారు…పొద్దు తిరుగుడు పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ. 6760 ఉండగా మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రతి క్వింటాలుకు దాదాపు రూ. 2 వేలు నష్టపోతున్నారు. గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు గారి చొరవ తో మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరకు రైతుల నుంచి పొద్దు తిరుగుడు విత్తనాలు కొని రైతులను ఆదుకోవడం జరిగింది. వెంటనే ఈ ప్రభుత్వం చొరవ చూపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధరకు సన్‌ఫ్లవర్ కొని రైతుల ప్రయోజనాలు కాపాడాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన వారు డిమాండ్ చేసారు…. ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ దరిపల్లి శ్రీను,సత్తి రెడ్డి,మోహిజ్, సంతోష్, కదుర్ల హేమంత్ లు పాల్గొన్నారు.

 

.

Leave A Reply

Your email address will not be published.