పున్నమి వెన్నెలకు ఆదివాసీల ఆత్మనివేదన

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : మేడారం తల్లులకు శతకోటి వందనాలు సమ్మక్క తల్లీ మేం మీ వారసులం,జాతిని కళ్ళార్పకుండా చూడండి.రెండేళ్ల కొకసారి వస్తున్నరు కదా …? మా అస్తిత్వం జాడ తెలపండి.మనుగడ కోసం మా పెనుగులాట ఏమిటి ?
నాటి కాకతీయులను ఎలా ఎదుర్కొన్నారో…!
నేడు నాగరికంలో వెనుకబడ్డారు తెలంగాణ కూడా వచ్చిపదేళ్లయింది ఇంకా వెదుకుతున్నాంమీ వీరత్వానికి చోటేదని మా అస్తిత్వం జాడేదని.!ఆసియాలోనే మీరు గొప్పని ప్రచారం చేస్తున్నరు జాతీయ హోదా అంటున్నరు. కాని రాష్ట్రంలో సరైన గుర్తింపే లేదు? జాతరప్పుడే కోయ దొరలు గుర్తొస్తున్నరు.తర్వాత గిరిజనుల్లో మీరు ఒకరని వదిలేస్తున్నరు.. !
మా గూడెంలో మా రాజ్యం ఏదని ప్రశ్నించండి ?ఆదివాసీలమైన మేమే అసలైన గిరిజనులమని చెప్పండి అడవిపై మాకే అధికార మియ్యమని ఆదేశించండి అన్యాక్రాంతమైన భూములకు విముక్తి నియ్యండి స్వయం పరిపాలనే మా రాజ్యాంగమని ఎరుకజేయండి వీరత్వం, ధీరత్వం, దైవత్వానికి వారసులమని చెప్పండిఆర్థికలేమి ఉన్నా నీతి నిజాయితీ నింపాదిగా ఆత్మగౌరవంతో బతుకుతున్న ములవాసులమని ఈ లోకానికి అవలోకనం చేయండి మీ రూపాన్ని, సంస్కృతిని మార్చి దండుకుంటున్న నయవంచకులను నివారించండి. (వన)జాతికి సరైన సామాజిక గుర్తింపేదని నిలదీయండి.?చట్టసభలలో అన్యాక్రాంతమైన మా సీట్లు..?ఇవేనని ఖాళీ చూపించండి.కోల్పోయిన కొలువులు తిరిగి ఇప్పించేయండి అంబేద్కర్ సాక్షిగా ఉన్నత ఉద్యోగాలు కల్పించి మమ్మల్ని ఉన్నతీకరించండి.వారసత్వ చుట్టరికానికిచట్టాలున్నాయనీ చాటింపేయండి.
చిలకల గుట్ట నుండి…ఒక్క చిటికేసి..!
మీ సన్నిధికి వచ్చిన వారందరూ మీ బిడ్డలేనని
దీవిస్తూ మమ్మల్ని చక్కగా పరిపాలించమని పాలకులకి చెప్పి వెళ్ళండి తల్లీ ! సమ్మక్క, సారక్క, పగిడిద్ద రాజు, జంపన్న, గోవిందరాజు, నాగులమ్మలకు వీడ్కోలు ఫిబ్రవరి 24తో మేడారం జనదేవతల వనప్రవేశం ముగిసింది. సేకరణ గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక