Take a fresh look at your lifestyle.

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ..

0 1,242

 తెలంగాణ బీసీ సంక్షే సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ.

బాల్కొండ, జనవరి 21 ( లోకం తీరు ) :

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో  సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా అయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7 నుండి 9 వరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీ కులగణన కోసం ధర్నా చేపట్టనున్నట్లు అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు.

భారతదేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ కులాలకు ఇంతవరకు వారి దమాష ప్రకారము బిసి జనగణన, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మారిన గాని కులగణన జరిపించకపోవడం సిగ్గుచేటని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,

ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన జరిపించకపోతే బీసీలు ఓట్లు వేయరని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ ఢిల్లీలో జరగబోయే జంతర్ మంతర్ వద్ద బీసీ కులగణన కోసం ధర్నా కోసం రావాలని పిలుపునిచ్చారు. చట్టసభలలో బిసి లకు వారి దమాషా ప్రకారం కేటాయించాలని, విద్య, వైద్య, రాజకీయ పరంగా తమకు చెందవలసిన వాటా ప్రకారం చెల్లించాలని లేనిపక్షంలో తమ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని అబ్బ గోని అశోక్ గౌడ్ తెలిపారు..

అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా రాజుల దేవి శ్రీనివాసుని నూతనంగా నియమించడం జరిగింది.

తర్వాత శాలువాతో రాజుల దేవి శ్రీనివాసుని అబ్బగోని అశోక్ గౌడ్ సన్మానించారు.

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రాజుల దేవి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీలు అనేక రకాలుగా వెనుకబడడం జరిగిందని.. వారికి అన్ని రకాలుగా అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ వెన్నంటే ఉండి ఉమ్మడి ఆదిలాబాద్ లోనూ మరియు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బీసీల కొరకు పోరాడుతానని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజుల దేవి శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేశవ శివకుమార్ , తొండల రాములు, నాగుల సదానంద్ నిర్మల్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.