Take a fresh look at your lifestyle.

మిర్జాపూర్ క్యాంపులో వేడుకగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ….

0 1,444

మిర్జాపూర్ క్యాంపులో వేడుకగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు అధ్యులు ఎన్టీఆర్.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 26 ( లోకంతీరు) : కులాలకు మతాలకు అతీతంగా ప్రజా రంజక పాలన విధానంతో ఎదిగిన మహనీయులు, నేడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు అధ్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్ లో  ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో ఆయన విగ్రహ విష్యకర్తగా పాల్గొని విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీ నినాదంతో జాతీయ పార్టీలకు సెగ పుట్టించిన మహనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహన్ని   కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జెహిరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,సీనియర్ నాయకులు రమాదేవి,యలమంచిలి శ్రీనివాస్ రావు,ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్,ఎంపీటీసీలు కరిమాభి,పార్వతి గంగాధర దేశాయ్,కొట్టం మనోహర్, సింగిల్ విండో చైర్మన్లు కూచి సిద్దు,డా.సునీల్ కుమార్, తాజా మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్,ఎన్టీఆర్ విగ్రహా విగ్రహ నిర్వాహకులు  దుప్పలపూడి శ్రీధర్ బాబు,కొల్లూరు రమేష్ బాబు, వేములపల్లి ఆనంద్ కుమార్,దమ్మలపాటి ఉదయ భాస్కర్,వేములపల్లి రాజ్ కుమార్,నార్ల సాయి శ్రీనివాస్,వేములపల్లి కృష్ణా రావు, డి.చౌదరి, ఎత్తొండ నాగులు,వల్లేపల్లి పెద్ద శ్రీనివాస్, పుప్పాల శంకర్, వడ్లమూడి రాధా కృష్ణ,ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.