బీసీ కార్పొరేషన్ల ఆమోదంపై హర్షం
-
సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు
-
జాతీయ బీసీ సంఘంలో హర్షాతిరేకాలు

నిజామాబాద్, మార్చ్ 12 ( లోకంతీరు ) : బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజీత్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామడుగు బాల కిషన్, జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళీ, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరు, గంగ పుత్ర కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో సంబంధిత కులాలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.