Take a fresh look at your lifestyle.

మహిళల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ధి….

0 1,308

మహిళల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ధి

కమ్మర్పల్లి , ఆగస్టు 2 (లోకంతీరు) : మహిళలు భాగస్వామ్యలుగా ఉన్నప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కమ్మర్పల్లి తహసిల్దార్ ఆంజనేయులు ఎంపీడీవో రాజ శ్రీనివాసు లు పేర్కొన్నారు,

శుక్రవారం కమ్మర్పల్లి మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజనసభ స్థానిక రైతు వేదికలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తహసిల్దార్ ఆంజనేయులు ఎంపీడీవో రాజ శ్రీనివాసులు ఈ సందర్భంగా మహిళా సమాఖ్య మహాజనసభను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రభుత్వాలు అందించే పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలన్న గ్రామాల్లో ప్రభుత్వాలు చేపట్టే నూతన కార్యక్రమాలు అమలు కావాలన్నా మహిళా సంఘాల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.

ఏపిఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మహిళా శక్తి పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.
మహిళా శక్తి ద్వారా నూతన వ్యాపారాల ఏర్పాటుకు రుణాలు అందించడం ఉన్న వ్యాపారాల అభివృద్ధికి మరియు అన్ని రకాల ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తోందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు రోజా రాణి సిబ్బంది రవికుమార్, శ్రీనివాస్ నవీన్, భాగ్యలక్ష్మి, పీరియా, అలేఖ్య అనసూయ, ధనలక్ష్మి 14 గ్రామాల నుంచి విచ్చేసిన 29 గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.