సాంఘిక సంక్షేమ కళాశాలకు డిగ్రీ లో ప్రవేశాలకు ప్రారంభం
-జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 13 ( లోకంతీరు ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ నందు వచ్చే విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ మొదటి సంవత్సరం లో ప్రవేశల కోసం, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటున్న బాలికలకు అవగాహన కల్పించి, డిగ్రీ మొదటి సంవత్సరం లో ప్రవేశం పొందడం కోసం రూపొందించిన కరపత్రాన్ని, గోడ పత్రికను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తుధవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు చదువుతో పాటు అన్ని వసతులు ఉచితంగా కల్పించబడతాయని అన్నారు.ఈ కార్యక్రమం లో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ కే. వనజ, వైస్ ప్రిన్సిపల్ వి. రేణుక, అడ్మిషన్స్ ఇంచార్జెస్ ఏ. పూర్ణిమ, డాక్టర్ డి. శ్రావణి పాల్గొన్నారు.