Take a fresh look at your lifestyle.

అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలు…. రైతు కంట కన్నీరు…..

0 1,367

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం సరే..! తడిసిన ధాన్యం సంగతి ఎలా…?

  • కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం

  • రైతు కంట కన్నీరు..!

  • అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలు..![

  • కానరాని అధికార నాయకులు…?

  • వ్యవసాయ అధికారులు ఎక్కడ…?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  ఏప్రిల్ 14 ( లోకం తీరు )  : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆగమవుతున్న రైతులు వారి గోడు వినే వారే కరువు. దేశానికి వెన్నెముక రైతు అనే ప్రచారం కొనసాగుతుంది. అదేవిధంగా దుక్కి దున్నే ఎద్దు బాధపడితే ఆ చేనులో పంట పండదు, రైతు కన్నీరు పెడితే దేశం బాగుపడదు అనే సామెత ను అప్పుడప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే మాటలు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కురుస్తున్న తుఫాను ప్రభావం, వడగండ్ల వానకు కోత కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిన తరుణంలో ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గాని, అధికారులు గాని, నాయకులు రైతుల పక్షాన ఉండి రైతు మేలుకోరి రైతుల ను పరామర్శించిన దాఖలాలు ఎక్కడ..? అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 60 శాతం వరకు కోతలు జరిగాయి.మిగతా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి కొన్నిచోట్ల నేలపాలు, మరికొన్నిచోట్ల రాలిన వరి ధాన్యం వలన రైతును శోక సముద్రంలో ముంచేత్తుతు న్నది. అయినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కోత కోయని వరి పొలాలకి కొంతమేర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.