Take a fresh look at your lifestyle.

కామ్రేడ్ డీవీ కృష్ణ స్మారక స్తూప నిర్మాణానికి శంకుస్థాపన…..

0 1,300

కామ్రేడ్ డీవీ కృష్ణ స్మారక స్తూప నిర్మాణానికి శంకుస్థాపన.

నిజామాబాద్ జిల్లా, ఎప్రిల్ 18 ( లోకంతీరు ) : సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల రేడియో స్టేషన్ ఎదురుగా సాయి నగర్ లో విప్లవోద్యమ నేత, కార్మిక యోధుడు, అమరుడు కామ్రేడ్ డి.వి కృష్ణ స్మారక స్తూప నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ…
కామ్రేడ్ డీవీ కృష్ణ ఆదర్శ కమ్యూనిస్టు, అరుదైన విప్లవోద్యమ నాయకుడని కొనియాడారు. కామ్రేడ్ డివి కృష్ణ తన జీవితాంతం విప్లవోద్యమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసినారని తెలిపారు. 1969 లో లేబర్ డిపార్ట్మెంటులో ఉద్యోగానికి రాజీనామా చేసి విప్లవోద్యమంలోకి వచ్చారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీ, కార్మిక, రైతు కూలీ ఉద్యమాల నిర్మాణాన్ని తీర్చిదిద్దారన్నారు. సిరిసిల్ల రైతాంగ పోరాటానికి మూలబిందువుగా నిలిచారన్నారు. అత్యంత నిజాయితీగా, ఆదర్శవంతంగా, రాజకీయాలలో విలువైన కమ్యూనిస్టు విప్లవకారునిగా నిలిచిన వ్యక్తి కామ్రేడ్ డీవీకే అని అన్నారు. అందువల్ల కామ్రేడ్ డీవీకే స్మారక స్థూపాన్ని నిర్మించి ఘన నివాళి అర్పించాలని పార్టీ జిల్లా కమిటీ భావించిందన్నారు. కామ్రేడ్ డీవీకే ద్వితీయ వర్ధంతి జూన్ 26 న స్థూపావిష్కరణ ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో CPI(ML) ప్రజాపంథా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, జిల్లా నాయకులు బి.దేవారం, డి.రాజేశ్వర్, సాయగౌడ్, నగర కార్యదర్శి ఎం.సుధాకర్, డివిజన్ నాయకులు సంధ్యారాణి, సాయిబాబా, సాయరెడ్డి, చరణ్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.