చిట్టాపూర్ లో దొంగల బీభత్సం…
భారీగా నగలు చోరీ

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 19 ( లోకంతిరు ) : బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన పుంచెట్టి లింగన్న అనే రైతు ఇంట్లో దొంగతనం జరిగి నగలు గుర్తుతెలియని వ్యక్తులు నగలు దొంగిలించినట్లు బాల్కొండ మండల ఎస్సై యాసిర్ అరాఫత్ కు బాధితుడు లింగన్నఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై, చోరీకి గురైన మున్నూరు కాపు కులానికి చెందిన పుంచెట్టి లింగన్న ఇంటికి వచ్చేసి దొంగతనం జరిగిన సంఘటన పరిశీలించారు. ఉదయం 10, 45 నిమిషాలకు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం కు వెళ్లినట్లు లింగన్న పోలీసులకు తెలియజేశారు. పొలం పనులు చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయని, ఇంటి లోపలికివెళ్లి చూడగా ఇంట్లోని బీరువా తెరిచి ఉందని, బీరువాలో ఉన్న బంగారుకమ్మలు, బంగారు కడెం, బంగారు చైను, బంగారు గుండ్లు, బంగారు తీగ, ఉంగరం, మొత్తం ఎనిమిది తులాల ఐదు మాసాల బంగారం దొంగతనానికి గురి అయ్యిందని బాధితులు పోలీసులకు విన్నవించారు. ఈ సందర్భంగా బాల్కొండ ఎస్సై యాసిర్ అరాఫత్ మాట్లాడుతూ, దొంగతనం గురైనసంఘటన స్థలంను పరిశీలించి, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు బాల్కొండ ఎస్సై తెలిపారు.