ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
- కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా , జూలై 22 ( లోకంతీరు ) : కామారెడ్డి లో కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో 91 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యా దులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ డిఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.