పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించినా బాల్కొండ తహసీల్దార్ శ్రీధర్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఆగస్టు 06 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని మంగళవారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, తాసిల్దార్ శ్రీధర్ సందర్శించారు. ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను కత్తిరించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి రేణుకా దేవి, కారోబర్ గణేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజ నరసయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్న గంగాధర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.