హైదరాబాదులో శిక్షణకు బయలుదేరిన కామారెడ్డి ఉపాధ్యాయులు

కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : నేషనల్ అచీవ్మెంట్ సర్వే లో భాగంగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రాజేంద్రనగర్ శిక్షణ సంస్థలో ఒక రోజు శిక్షణకు బయలుదేరినట్లు ఉపధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3,6,9 తరగతుల విద్యార్థులలోని అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించడానికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందినట్లు వారు తెలిపారు. వీరు త్వరలో జిల్లా స్థాయిలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు డా. వెంకన్నగారి జ్యోతి, జంగం శ్రీశైలం, జక్కుల శ్రీనివాస్, ఏసురత్నం, సురేందర్, రజిని తదితరులు ఉన్నారు.